Chuttalabbayi Telugu Movie Review | New Telugu Movie Chuttalabbayi Review
చిత్రం: ‘చుట్టాలబ్బాయి’
నటీనటులు: ఆది - నమిత ప్రమోద్ - సాయికుమార్ - అభిమన్యు సింగ్ - పోసాని కృష్ణమురళి - పృథ్వీ - ఆలీ - జాన్ కొక్కెన్ - షకలక శంకర్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: అరుణ్ కుమార్
మాటలు: భవానీ ప్రసాద్
నిర్మాతలు: వెంకట్ తలారి - రామ్ తాళ్లూరి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వీరభద్రం చౌదరి
ప్రేమకావాలి.. లవ్లీ లాంటి యావరేజ్ సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని ఆరంభించాడు ఆది. ఇంకా మెరుగైన ఫలితాల్ని అందుకోవాలనే ప్రయత్నంలో అతను చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టేసి.. ఆమాత్రం ఫలితం కూడా అందుకోలేని స్థితికి వచ్చేశాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్న ఆది.. అలాంటి స్థితిలోనే ఉన్న వీరభద్రం చౌదరితో జట్టు కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘చుట్టాలబ్బాయి’ వారి కోరిక తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి.
కథ:
ఇంజినీరింగ్ పూర్తి చేశాక విదేశాలకు వెళ్లాలని కలలు కని.. ఆ ప్రయత్నంలో విఫలమై రికవరీ ఏజెంటుగా మారిన బాబ్జి (ఆది) అనుకోకుండా కావ్య (నమిత ప్రమోద్) అనే అమ్మాయిని యాదృచ్ఛికంగా రెండు మూడుసార్లు కలుస్తాడు. ఐతే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అని అపార్థం చేసుకుని కావ్య అన్నయ్య (అభిమన్యు) బాబ్జీని టార్గెట్ చేస్తాడు. అదే సమయంలో తన అన్నయ్య చూసిన సంబంధం ఇష్టం లేక కావ్య ఇంట్లోంచి పారిపోతుంది. కొన్ని కారణాల వల్ల బాబ్జీ కూడా కావ్య వెంట వెళ్లి.. ఆమెను తన ఊరికి తీసుకెళ్లాల్సి వస్తోంది. మరోవైపు కావ్యను చంపడానికి ఓ గ్యాంగ్ తీరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఇంటి దగ్గరా కొన్ని సమస్యలు బాబ్జీని చుట్టుముడతాయి. మరి వాటన్నిటి నుంచి బాబ్జీ ఎలా తప్పించుకున్నాడు.. కావ్యతో అతడి రిలేషన్ ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హీరో ఆదికి అయినా.. దర్శకుడు వీరభద్రంకు అయినా ‘చుట్టాలబ్బాయి’కి ముందు ఎదురు దెబ్బలు తగిలింది ‘రొటీన్’ సినిమాల వల్లే. ప్రేక్షకులు కొత్తదనం వైపు చూస్తున్న సమయంలో.. వీళ్లిద్దరూ రొటీన్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారు. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ‘చుట్టాలబ్బాయి’లో ఏదైనా కొత్తగా ప్రయత్నించి ఉంటారేమో అని ఆశిస్తే నిరాశ తప్పదు. ఆది గత సినిమా ‘గరం’.. వీరభద్రం లాస్ట్ మూవీ ‘భాయ్’తో పోలిస్తే ‘చుట్టాలబ్బాయి’ మెరుగే కానీ.. కొత్తదనం ఏ కోశానా కనిపించని ఈ సినిమా మంచి ఫీలింగైతే ఇవ్వదు.
కామెడీ లేకపోవడం వల్లే ‘భాయ్’ పోయిందంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు వీరభద్రం. కానీ కామెడీకి తోడు కొత్తదనం కూడా లేకపోవడమే ఆ సినిమాకు వచ్చిన సమస్య. ‘చుట్టాలబ్బాయి’లో కొంచెం కామెడీ డోస్ అయితే పెంచాడు కానీ.. కొత్తదనం గురించి మాత్రం ఆలోచించలేదు. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లుగా అనిపించే ఈ సినిమా అక్కడక్కడా నవ్వించింది కానీ.. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తిని మాత్రం రేకెత్తించలేకపోయింది. కామెడీ హిలేరియస్ గా ఉండుంటే చెల్లిపోయేది కానీ.. ఏదో అక్కడక్కడా కొంచెం రిలీఫ్ ఇచ్చింది తప్ప మొత్తంగా సినిమా మీద ఇంప్రెషన్ మార్చే స్థాయిలో కామెడీ పండలేదు.
‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మొదలుకుని ‘చుట్టాలబ్బాయి’ కథా కథనాల్లో చాలా సినిమాల ఛాయలు కనిపిస్తాయి. అలా పోలికలు చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంత అవుతుంది. ప్రతి సన్నివేశం కూడా ఇప్పటికే చాలాసార్లు చూసిన భావన కలిగిస్తుంది. ముందు గొడవతో పరిచయమై ఆ తర్వాత ప్రేమలో పడిపోయే హీరో హీరోయిన్ల ట్రాక్ అయితే మరీ రొటీన్. ప్రతి పాత్ర గురించి పరిచయంలో ఏదో అనుకుంటాం.. కానీ తర్వాతి సన్నివేశంలోనే ఆ పాత్ర తేలిపోతుంది.
ఇలాంటి నిలకడ లేని పాత్రలు.. సన్నివేశాలతో కథనం చాలా మామూలుగా సాగిపోతుంటే.. ‘ఇగో రెడ్డి’ పాత్రలో పృథ్వీ అక్కడక్కడా రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. పోసాని.. రఘుబాబు.. షకలక శంకర్.. ఆలీల కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది. లవ్ స్టోరీ కానీ.. యాక్షన్ ఎపిసోడ్లు కానీ చాలా మొక్కుబడిగా సాగిపోతాయి. ఏమాత్రం ఎంగేజ్ చేయవు. సాయికుమార్ పాత్ర మీద చాలా ఆశలు పెట్టుకుంటాం కానీ.. ఆయన గెటప్ ఉన్నంత ఆకర్షణీయంగా పాత్ర లేదు. ద్వితీయార్ధంలో ఫ్యామిలీ డ్రామాతో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. మొత్తంగా చూస్తే కొన్ని నవ్వుల కోసమైతే ‘చుట్టాలబ్బాయి’ ఓకే కానీ.. అంతకుమించి ఏం ఆశించినా నిరాశ తప్పదు.
నటీనటులు:
ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఆది ఆత్మవిశ్వాసంతో నటిస్తున్నందుకు.. చలాకీగా కనిపిస్తున్నందుకు అభినందించాలి. కానీ ఇలాంటి కథల్ని ఎంచుకుంటున్నందుకు మాత్రం అతణ్ని క్షమించలేం. విషయం లేని రొటీన్ కథల్లో ఎంత కాన్ఫిడెంటుగా కనిపిస్తేనేం.. అదిరిపోయే డ్యాన్సులు ఫైట్లు చేస్తేనేం. అవేవీ కూడా సినిమాకు అక్కరకు రాలేదు. మలయాళ భామ నమితా ప్రమోద్ గ్లామర్ పరంగా ఆకట్టుకోలేదు కానీ.. నటన బాగుంది. సాయికుమార్ కొత్తగా చేసిందేమీ లేదు. ఆయన ప్రత్యేకత చూపించే పాత్ర కాదిది. విలన్ అభిమన్యు సింగ్ ఒకే రకం హావభావాలతో విసిగించాడు. జాన్ కొక్కెన్ కూడా అంతే. పృథ్వీ తన పాత్రలో కొత్తదనం లేకపోయినా.. తనదైన టైమింగ్ తో నవ్వించి రిలీఫ్ ఇచ్చాడు.
సాంకేతికవర్గం:
తమన్ తన వంతుగా సినిమాకు మంచి ఔట్ పుటే ఇచ్చాడు. ఓ మాస్ సినిమాకు సరిపోయే ఊపున్న పాటలిచ్చాడు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఛాయాగ్రహణం కూడా బాగుంది. ఎలాంటి కాంబినేషన్లో సినిమా తీస్తున్నామో ఆలోచించకుండా కొత్త నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు. సినిమాలో క్వాలిటీ కనిపిస్తుంది. ‘జక్కన్న’లో పంచ్ డైలాగులతో విసుగెత్తించిన డైలాగ్ రైటర్ భవానీ ప్రసాద్ ఇందులోనూ వాటి మీదే ఆధారపడ్డాడు. కాకపోతే కొంచెం బెటర్. పృథ్వీకి.. షకలక శంకర్ కు రాసిన కొన్ని మాటలు నవ్వించాయి. వీరభద్రం.. రచన దర్శకత్వం రెండు విభాగాల్లోనూ ఫామ్ అందుకోలేకపోయాడు. ప్రేక్షకుల అభిరుచి మారుతున్న విషయం గుర్తించకుండా రొటీన్ కంటెంటుతో సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నించాడతను. కామెడీని డీల్ చేయడంలో మాత్రం కొంత వరకు సక్సెస్ అయ్యాడు తప్ప.. కథాకథనాల విషయంలో అతను విఫలమయ్యాడు.
చివరగా: ఈ అబ్బాయిని ‘చుట్టం’ చేసుకోలేం
రేటింగ్: 2.25/5

No comments:
Post a Comment