ఇప్పుడు చెప్పండర్రా… ‘స్పైడర్’ టాక్..!
ఇప్పుడు చెప్పండర్రా… ‘స్పైడర్’ టాక్..! ‘ఫస్ట్ లుక్ పోస్టర్స్’ కావాల్సిన కిక్ ను పంచడంలో విఫలం కావడంతో, ‘ఫస్ట్ టీజర్’ కోసం అభిమానులు ఎంతగానో నిరీక్షించారు. మరి ఆ ఎదురు చూపులకు తగిన ఫలితం దక్కిందా? అభిమానులు ఆశించిన విధంగానే “స్పైడర్” టీజర్ ఉందా? దర్శకుడు మురుగదాస్ – ప్రిన్స్ మహేష్ బాబుల కాంభినేషన్ పై సినీ అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? అసలేంటి ఈ ‘స్పైడర్’ కాన్సెప్ట్? ఇన్ని ప్రశ్నలకు ఈ చిన్న టీజర్ లో సమాధానం లభించదు గానీ, మొత్తానికి ‘ఏదో’ ఈ కాంభినేషన్ సృష్టించబోతుందన్న విషయమైతే స్పష్టం చేసింది టీజర్. ‘స్పైడర్’ అంటూ ఓ ఆసక్తికర టైటిల్ ను ప్రకటించిన చిత్ర యూనిట్… ఫస్ట్ లుక్ లో ఆ ‘స్పైడర్’ తాలూకు కాన్సెప్ట్ ను బిల్డప్ చేయలేకపోయారు కానీ, ఈ టీజర్ లో టైటిల్ యొక్క ఉద్దేశం, సినిమా కాన్సెప్ట్ ను కొంతవరకు అందించడంలో సక్సెస్ అయ్యారు. టీజర్ గురించి చెప్పాలంటే… గ్రాఫికల్ మోడ్ లో ఉన్న స్పైడర్ మహేష్ దగ్గరికి వెళ్తుంది… దానిని చూసి మహేష్ ‘ష్…’ అంటారు… అంతే..! అయితే దీనిని చూపించిన విధానం మురుగదాస్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుండగా, ఈ గ్రాఫికల్ స్పైడర్ తోనే సినిమాలో ‘జేమ్స్ బాండ్’ తరహా విన్యాసాలను ప్రిన్స్ చేయబోతున్నాడన్న ‘కాన్సెప్ట్’ను టీజర్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. ఇది సింపుల్ గా “స్పైడర్” టీజర్ కాన్సెప్ట్. ఇక ఈ టీజర్ లో మొత్తం క్రెడిట్ కొట్టేసింది మాత్రం సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్. క్యూబ్ గా ఉన్న ‘స్పైడర్’ తయారీ నుండి అది మహేష్ భుజానికి చేరుకునే వరకు టీజర్ ను నడిపించింది హారిస్ జయరాజ్ సంగీతమే. ఈ తరహా సంగీతాన్ని అందించడంలో హారిస్ దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్, సంతోష్ ఫోటోగ్రఫీ టీజర్ లోని నాణ్యతను చూపిస్తోంది. ఇక చెప్పడానికేముంది… మీరే చెప్పండర్రా… స్పైడర్ టీజర్ టాక్..!

No comments:
Post a Comment